బేతాయిపల్లెలో తాగునీటి కష్టాలు

ABN , First Publish Date - 2021-10-15T05:26:42+05:30 IST

ఏళ్ల తరబడి బేతాయిప ల్లె ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. వంద కుటుంబాలున్న గ్రామం లో మూడు బోర్లున్నా ఆనీరు తాగేందుకు వీలుపడదు.

బేతాయిపల్లెలో తాగునీటి కష్టాలు
పొలం బోరు వద్ద నీటి కోసం అవస్థలు పడుతున్న మహిళలు

ఏళ్లగా తీరని ప్రజల ఇబ్బందులు

గోపవరం, అక్టోబరు 14: ఏళ్ల తరబడి బేతాయిప ల్లె ప్రజలు  తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. వంద కుటుంబాలున్న గ్రామం లో మూడు బోర్లున్నా ఆనీరు తాగేందుకు వీలుపడదు. దీంతో గ్రామస్తులు తాగునీటి ఇబ్బందులు తట్టుకోలేక సమీప పొలాల్లో ఉన్న బోరు బావి నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఎంతో దూరమైనా బోరుబావి నీటిపై ఆధారపడే వారు ఇబ్బందులు పడుతున్నా నీటిని తెచ్చుకుంటున్నారు.

ఆర్థికంగా ఉన్న వారు శుద్ధినీటిని కొనుగోలు చేసి బతుకీడుస్తున్నారు. మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా కన్పి స్తోంది. పొలాల్లో పంటలు లేకపోతే తాగునీరు తెచ్చుకోవడంలో ఎంతో కొంత ఇబ్బంది ఉంటుం ది. పొలం యజమాని పంట సాగు చేస్తే నానా అవస్థలు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయిందని వారు వాపోతున్నారు.

ఇలా ఎంతకాలం తాగునీటి కోసం తంటాలు పడాలంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పొలంలో ఉండే బోరు బావి నీరే తాగేందుకు బాగున్నాయని రైతుతో మాట్లా డి ఆ బోరు నుంచి పైప్‌లైన్‌ గ్రామంలోకి ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు ఆ దిశగా ప్రయ త్నం చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-15T05:26:42+05:30 IST