కాల్వలను వెంటనే పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-09-03T05:01:09+05:30 IST

చిత్రావతి బ్యా లెన్సింగ్‌ రిజర్వాయర్‌లో దాదాపు 10టీఎంసీల నీరు న్నా కాల్వలు పూర్తికానం దున మండలాల్లో పంట పొలాలకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని కడప జిల్లా అఖిలపక్ష నేతలు అన్నారు.

కాల్వలను వెంటనే పూర్తిచేయాలి
సీబీఆర్‌ ప్రాజెక్టును పరిశీలిస్తున్న అఖిలపక్ష పార్టీ నేతలు

పులివెందుల రూరల్‌, సె ప్టెంబరు 2: చిత్రావతి బ్యా లెన్సింగ్‌ రిజర్వాయర్‌లో దాదాపు 10టీఎంసీల నీరు న్నా కాల్వలు పూర్తికానం దున మండలాల్లో పంట పొలాలకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని కడప జిల్లా అఖిలపక్ష నేతలు అన్నారు. గురువారం సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేతలు బండి జకర య్య, సత్తార్‌, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్‌వీ ప్రసాద్‌, సీపీఎం పులివెందుల నాయకుడు గఫూర్‌ లింగాల మండలం పార్న పల్లె వద్దనున్న సీబీఆర్‌ ప్రాజెక్టును పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ లింగాల కుడికాల్వ పరిధిలో పెండింగ్‌ పనుల కారణం గా పూర్తిస్థాయిలో రైతులు నీటిని అందుకోలేకపోతున్నారన్నారు. సీఎం స్పందించి కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చే శారు. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T05:01:09+05:30 IST