డాక్టర్‌ సుధాకర్‌ మరణం సర్కారు హత్యే

ABN , First Publish Date - 2021-05-23T05:12:08+05:30 IST

డాక్టర్‌ సుధాక ర్‌ మరణం ముమ్మాటికీ సర్కారు హత్యేనని టీడీపీ బద్వేలు నియోజకవర్గ బాధ్యులు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.

డాక్టర్‌ సుధాకర్‌ మరణం సర్కారు హత్యే

టీడీపీ నేతలు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి

బద్వేలు/ఖాజీపేట,  మే 22: డాక్టర్‌ సుధాక ర్‌ మరణం ముమ్మాటికీ సర్కారు హత్యేనని టీడీపీ బద్వేలు నియోజకవర్గ బాధ్యులు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. డాక్టర్‌ సుధాకర్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన బద్వేలు టీడీపీ నేత రాజశేఖర్‌ మా ట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో మా స్కులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినందుకే దళిత డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చివాడని ముద్ర వేసి వేధింపులకు గురిచేశారని ఆరోపించా రు.

దీంతోనే ఆయన మనస్థాపానికి గురై గుండెపోటుతో మరణించారని ఆరోపించారు.  ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు రో డ్డుపై లాఠీలతో కొట్టించారని, నిరసన తెలి యజేస్తుంటే మానసికంగా, శారీరకంగా హింసించారని రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ చనిపోయాక కూడా ఓ దినపత్రికలో తప్పుడు కథనాలు చూసాక ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యేనని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, డాక్టర్‌ కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు.

Updated Date - 2021-05-23T05:12:08+05:30 IST