క్రీడాకారిణికి రూ.50 వేలు అందజేత

ABN , First Publish Date - 2021-10-26T04:48:41+05:30 IST

జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారిణికి టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ రూ.50 వేలు అందచేశారు.

క్రీడాకారిణికి రూ.50 వేలు అందజేత
కవితను సన్మానిస్తున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌

దువ్వూరు, అక్టోబరు 25: జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారిణికి టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ రూ.50 వేలు అందచేశారు. మండల పరిధిలోని గుడిపాడు గ్రామానికి చెందిన వరికూటి కవిత అనే విద్యార్థిని జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో కాంస్య పతకం సాధించింది. విషయం తెలుసుకున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌ సోమవారం గుడిపాడు గ్రామంలోని కవిత ఇంటికి వెళ్లి ఆమెను సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని తెలిపారు. ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల వెంకటకొండారెడి ్డ, మండల అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:48:41+05:30 IST