నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళం
ABN , First Publish Date - 2021-10-29T05:13:40+05:30 IST
గండి క్షేత్రంలో శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ.100116 విరాళం అందించినట్లు ఆలయ సహాయ కమిషనర్ అలవలపాటి ముకుం దరెడ్డి తెలిపారు.

చక్రాయపేట, అక్టోబరు 28: గండి క్షేత్రంలో శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ.100116 విరాళం అందించినట్లు ఆలయ సహాయ కమిషనర్ అలవలపాటి ముకుం దరెడ్డి తెలిపారు. గురువారం గండి క్షేత్రంలోని స్థానిక కార్యాల యంలో మైలవరం మండలం పెద్దకొమెర్ల వాసి శీలం ప్రభావతి, శివరామిరెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.100116 అందించినట్లు తెలిపారు. స్వామివారి దర్శనానంతరం వారికి ఆలయ అర్చకులు కేసరిస్వామి, రాజాస్వామి తీర్థప్రసాదాలు అందజేసినట్లు ముకుందరెడ్డి తెలిపారు.