బుగ్గన కరుణ చూపేనా..?
ABN , First Publish Date - 2021-05-20T05:56:45+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 2019 డిసెంబరు 23న వైఎ్‌సఆర్ స్టీల్ ప్లాంట్‌కు పునాదిరాయి వేశారు. ఈ పనులు పరుగులు పెట్టాలంటే నిధులు అవసరం. యోగి వేమన, వైఎ్‌సఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన ఆర్ట్స్ విశ్వవిద్యాలయాల ప్రగతికి నిధులు ఇవ్వాలి.

జిల్లాలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన
నిధులిస్తేనే పనుల పురోగతి
పులివెందుల ప్రగతి సరే..
మిగిలిన నియోజకవర్గాల అభివృద్ధికీ నిధులు ఇవ్వాలి
నేడు ఆర్థిక మంత్రి బుగ్గన 2021-22 బడ్జెట్
(కడప-ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 2019 డిసెంబరు 23న వైఎ్‌సఆర్ స్టీల్ ప్లాంట్‌కు పునాదిరాయి వేశారు. ఈ పనులు పరుగులు పెట్టాలంటే నిధులు అవసరం. యోగి వేమన, వైఎ్‌సఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన ఆర్ట్స్ విశ్వవిద్యాలయాల ప్రగతికి నిధులు ఇవ్వాలి. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి కొళాయి ద్వారా తాగునీరు ఇవ్వాలంటే రూ.3,500 కోట్లు కావాలి. పులివెందులతో పాటు అన్ని నియోజకవర్గాలు సమాన ప్రగతి సాధించాలంటే ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. కడప గడపన ప్రగతి పరుగులు పెట్టాలంటే నేడు విత్త మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశ పెట్టే బడ్జెట్లో జిల్లాకు సముచిత స్థానం కల్పించాలి.
సిరి ఇస్తేనే జలసిరి
జిల్లాలో కేసీ కాలువ పరిధిలో 75 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే మైదుకూరు, కడప, కమలాపురం నియోజకవర్గాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఈ ఇబ్బందిని అధిగమించి జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు, ప్రజలందరికీ తాగునీరు అందించేందుకు 2019లో పలు ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.1,357.10 కోట్లతో రాజోలి జలాశయం, రూ.312 కోట్లతో జొలదరాశి జలాశయం, రూ.564.60 కోట్లతో కుందూ-టీజీపీ లిఫ్ట్, రూ.4,373.93 కోట్లతో జీఎనఎ్‌సఎ్‌స-హంద్రీనీవా లిఫ్ట్, రూ.100 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్-సీబీఆర్-ఎర్రబల్లి ఎత్తిపోతల పథకం, రూ.50 కోట్లతో గాలేరు నగరి-అలవలపాడు లిఫ్ట్, రూ.40 కోట్ల అంచనాతో ఝరికోన లిఫ్ట్, చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లకు కృష్ణా జలాలు ఎత్తిపోసే గండికోట లిఫ్ట్ సామర్థ్యం పెంపు పనులు ముఖ్యమైనవి. ఈ ప్రాజెక్టులకు టెండర్లు కూడా పూర్తి చేశారు. గతేడాది బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో నిరాశే మిగిలింది. ఈ ఏడాదైనా బుగ్గన కరుణ చూపాలని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఉక్కు పరిశ్రమకు నిధులేవీ?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిశ్రమ వైఎ్‌సఆర్ స్టీల్ ప్లాంట్. రూ.12-15 వేల కోట్ల పెట్టుబడి, దశలవారీగా 3 మిలియన టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ నిర్మాణానికి 2019 డిసెంబరు 23న సీఎం జగన పునాదిరాయి వేశారు. పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. మౌలివ వసతులకు రూ.500 కోట్లు నిధులు అవసమని అంచనా. గత బడ్జెట్లో రూ.275 కోట్లు కేటాయించినా పనులు మొదలు కాలేదు. ఈ బడ్జెట్లోనైనా పూర్తి నిధులు ఇచ్చి పనులు చేపట్టాలి. అలాగే.. కడప నగర సమీపంలో 692.58 ఎకరాల్లో మెగా ఇండసీ్ట్రయల్ పార్కుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్కడ కూడా మౌలిక సౌకర్యాల కోసం నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
యూనివర్సిటీ ప్రగతికి రూ.100 కోట్లు కావాలి
యోగి వేమన విశ్వవిద్యాలయంలో పరిపాలన భవనం, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బ్లాక్, మానవీయ శాస్త్ర భవనం వంటివి నిధులు లేక అసంపూర్తిగా ఆగిపోయాయి. ఆడిటోరియం బిల్డింగ్, టీచింగ్, నాన టీచింగ్ సిబ్బంది క్వార్టర్స్, వీసీ భవనం నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు.. పనులు మొదలు కాలేదు. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రొద్దుటూరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్, ల్యాబ్, తరగతి గదులు లేవు. మౌలిక వసతులు లేక కళాశాలలో బిటెక్ విద్యార్థులు చేరేందుకు ముందుకు రావడం లేదు. ఈ పనులు చేయాలంటే రూ.100 కోట్లు కావాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే.. నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎ్‌సఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన ఆర్ట్స్ యూనివర్సిటీ నూతన భవన నిర్మాణాలకు సుమారుగా మరో రూ.100 కోట్లు కావాలి. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలలో 24 గంటలు నడిచే కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం నిర్మాణాలకు సీఎం జగన శంకుస్థాపన చేశారు. నిధులు ఇస్తేనే వీటి నిర్మాణాలు వేగం పుంజుకుంటాయి.
నిధుల దాహం తీర్చాలి
జిల్లాలో ఇంటింటికి కొళాయి.. ప్రతి మనిషికి శుద్ధి చేసిన 135 లీటర్లు అందివ్వాలనే లక్ష్యంగా వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేశారు. ఇందుకోసం రూ.3,600 కోట్లు నిధులు కావాలి. ఈ ఫైలు ప్రభుత్వం వద్దకు చేరింది. పులివెందుల నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్ కోసం మాత్రమే రూ.480 కోట్లు మంజూరు చేశారు. టెండర్లు కూడా పూర్తి చేశారు. మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటీ..? పల్లెజనం దాహం తీరాలంటే బుగ్గన నిధుల దాహం తీర్చాలి. జిల్లా అభివృద్ధి అంటే పులివెందుల నియోజకవర్గం ఒక్కటే కాదు.. అంతకాకపోయినా అందులో సగం నిధులైనా ఇతర నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో కేటాయించాలని జిల్లా ప్రజల విన్నపం.