అనధికారిక లేఔట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దు

ABN , First Publish Date - 2021-08-11T05:08:24+05:30 IST

కార్పొరేషన్‌ పరిధిలో అనధికారిక లేఅవుట్లకు రిజిస్ట్రేషన్‌ చేయవద్దని కమిషనర్‌ లవన్న పేర్కొన్నారు. కడప కార్పొరేషన్‌ కమిషనర్‌ చాంబర్‌లో మంగళవారం సాయంత్రం సబ్‌ రిజిస్ట్రార్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.

అనధికారిక లేఔట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దు
మాట్లాడుతున్న కమిషనర్‌ లవన్న

కమిషనర్‌ లవన్న

కడప(ఎర్రముక్కపల్లె), ఆగస్టు 10: కార్పొరేషన్‌ పరిధిలో అనధికారిక లేఅవుట్లకు రిజిస్ట్రేషన్‌ చేయవద్దని కమిషనర్‌ లవన్న పేర్కొన్నారు. కడప కార్పొరేషన్‌ కమిషనర్‌ చాంబర్‌లో మంగళవారం సాయంత్రం సబ్‌ రిజిస్ట్రార్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో బిల్డర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఎటువంటి అనుమతులు లేకుండానే లేఅవుట్లు నిర్మించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కార్పొరేషన్‌ అనుమతి ఉన్నవాటికే రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సత్యనారాయణ, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ నాగేంద్ర, సబ్‌ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T05:08:24+05:30 IST