శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

ABN , First Publish Date - 2021-11-27T05:08:58+05:30 IST

మండల వ్యాప్తంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి అన్నారు. శుక్రవారం వల్లూరు పోలీ్‌సస్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిధిలోని రికార్డులను పరిశీలించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

వల్లూరు, నవంబరు 26: మండల వ్యాప్తంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి అన్నారు. శుక్రవారం వల్లూరు పోలీ్‌సస్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిధిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక ఎస్‌ఐ విస్ణువర్ధన్‌ను మండల వ్యాప్తంగా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారన్న అంశంపై వివరాలు తీసుకున్నారు. ఈయన వెంట రూరల్‌ సీఐ శ్రీరామ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T05:08:58+05:30 IST