క్రాప్‌లోను రెన్యువల్‌లో రైతులను ఇబ్బంది పెట్టకండి
ABN , First Publish Date - 2021-05-14T05:10:16+05:30 IST
పంట రుణాల రెన్యువల్‌లో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎస్‌బీఐ అధికారులను జిల్లా వ్యవసా య సలహా మండలి ఛైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి సూ చించారు.

ఎర్రగుంట్ల, మే 13: పంట రుణాల రెన్యువల్‌లో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎస్‌బీఐ అధికారులను జిల్లా వ్యవసా య సలహా మండలి ఛైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి సూ చించారు. గురువారం ఆయన రైతులతో కలిసి బ్యాంకు మేనే జర్‌ను కలిసేందుకు ఎర్రగుంట్ల రాణీవనంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచికు ఆయన వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అంతటా ఒక సంస్కరణ ప్రకారం కేవ లం వడ్డీలు కట్టించుకుని ఖరీఫ్ క్రాఫ్ లోన్లు రెన్యువల్ చేస్తావుంటే ఇక్కడ మాత్రం అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లిస్తేనే రుణాలు రెన్యువల్ చేస్తామనడం దారుణమన్నారు. బ్యాంకు మేనేజర్ మాధవరావుకు రెండురోజుల క్రితమే విష యం చెప్పి అభ్యర్థించిన ఎలాంటి మార్పు లేదన్నారు. ఎస్‌బీ ఐ చీఫ్‌మేనేజర్, లీడ్ బ్యాంకు మనేజర్‌కు కూడా ఈవిష యాన్ని వివరించి ఫిర్యాదు చేసినట్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్స్‌లు రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిం చవద్దని తీరును మార్చుకోవాలని, అన్నదాతలను గౌరవించా లని కోరారు. వడ్డీ మాత్రమే కట్టించుకుని రుణాలు రెన్యువల్ చేయకపోతే రైతులతో కలిసి బ్యాంకు వద్ద ఽబారీ ఎత్తునఽ దర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.
వడ్డీ చెల్లించినా రెన్యువల్ చేస్తాం
-మాధవరావు, ఎస్‌బీఐ మేనేజర్.
ఖరీఫ్ క్రాప్‌లోన్ రెన్యువల్ చేసుకునే రైతులు తప్పనిసరిగా అసలు చెల్లించాల్సిన అవసరంలేదు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించినా రుణాన్ని తిరిగి రెన్యువల్ చేస్తాం. కరోనా నేపథ్యంలో బ్యాంకు పనివేళలు పూర్తిగా మారిపోయాయి. సిబ్బందికూడా తగ్గిపోయారు. రైతులు గుంపులుగా వచ్చి సమస్యలను అడుగుతున్నారు. అందులో భాగంగా అసలుతో పాటు వడ్డీ కట్టినా మంచిదని ఫీల్డ్ ఆఫీసర్ రైతులకు తెలిపా రు. అసలుతోపాటు వడ్డీ కట్టినా, కేవలం వడ్డీ మాత్రమే కట్టినా లోన్ రెన్యువల్ చేసామన్నారు.