అధైర్యం వద్దు.. అండగా నేనున్నా

ABN , First Publish Date - 2021-02-06T05:50:37+05:30 IST

తెలుగుదేశం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొందని, ఎవరికీ భయపడవద్దని ఽధైర్యంగా ముందడుగు వేసి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబు జమ్మలమడుగు టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

అధైర్యం వద్దు.. అండగా నేనున్నా
ఎన్టీఆర్‌ భవన్‌లో జమ్మలమడుగు కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు

ఆయారాం గయారాంలను టీడీపీ ఎందరినో చూసింది

పంచాయతీ ఎన్నికల్లో బలమేంటో చూపించండి

టీడీపీ అధినేత చంద్రబాబు

జమ్మలమడుగు / కడప, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొందని, ఎవరికీ భయపడవద్దని ఽధైర్యంగా ముందడుగు వేసి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబు జమ్మలమడుగు టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. శుక్రవారం అమరావతిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌లు పార్టీ ఫిరాయించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన కార్యకర్తలు చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా అధినేత మాట్లాడుతూ  ఆయారాం గయారాంలతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని, కార్యకర్తల నుంచే కొత్తనాయకుడు పుట్టుకొస్తాడని చంద్రబాబు పేర్కొన్నారు. గండికోట పరిహారంలో అవినీతి బయటపెట్టినందుకు గురుప్రతాప్‌రెడ్డిని దారుణంగా హత్య చేశారని, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు ప్రశ్నించినందుకు ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను హత్య చేశారని చంద్రబాబుపేర్కొన్నారు. చివరకు దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసే నీచస్థాయి దిగజారారని అన్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతుదారులను గెలిపించాలని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని అండగా తానున్నానని కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు.


జమ్మలమగుడు, పులివెందుల ఇన్‌చార్జిగా బీటెక్‌ రవి

జమ్మలమడుగు నియోజకవర్గానికి బలమైన నాయకుని అవసరం ఉందని కార్యకర్తలు తెలిపారు. వారి అభీష్టం మేరకు జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని నియమించినట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆయన నాయకత్వంలో కార్యకర్తలంతా సమష్టిగా కష్టపడి స్థానిక ఎన్నికల్లో టీడీపీ బలపరచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.Updated Date - 2021-02-06T05:50:37+05:30 IST