రేపు జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌ టెన్నీ్‌స ఎంపికలు

ABN , First Publish Date - 2021-10-30T04:54:54+05:30 IST

పట్టణంలోని జార్జి కారోనేషన్‌ క్లబ్‌లో ఈనెల 31వ తేదీ (ఆదివారం )ఉద యం 9 గంటలకు జిల్లాస్థాయి సబ్‌జూనియర్‌ సాఫ్ట్‌ టెన్నీస్‌ ఎంపికలు జరుగుతాయని సాఫ్ట్‌ టెన్నీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గురుశంకర్‌, కార్యదర్శి రేవంత్‌లు తెలిపారు.

రేపు జిల్లాస్థాయి  సబ్‌ జూనియర్‌  సాఫ్ట్‌ టెన్నీ్‌స ఎంపికలు

ప్రొద్దుటూరు టౌన్‌, అక్టోబరు 29: పట్టణంలోని జార్జి కారోనేషన్‌ క్లబ్‌లో ఈనెల 31వ తేదీ (ఆదివారం )ఉద యం 9 గంటలకు  జిల్లాస్థాయి సబ్‌జూనియర్‌ సాఫ్ట్‌ టెన్నీస్‌ ఎంపికలు జరుగుతాయని సాఫ్ట్‌ టెన్నీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గురుశంకర్‌, కార్యదర్శి రేవంత్‌లు తెలిపారు.  ఈ ఎంపికల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రొద్దుటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. క్రీడాకారులు 2006 జనవరి 1 నుంచి 2011 డిసెంబరు 31వ తేదీ మధ్యలో జిన్మించి ఉండాలని తెలిపారు. 

Updated Date - 2021-10-30T04:54:54+05:30 IST