నేడు బియ్యం సరఫరా ట్రక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-01-21T05:11:54+05:30 IST

పౌరసరఫరాల బియ్యం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద మంజూరు చేసిన ట్రక్కులను ఎంపికైన లబ్ధిదారులకు మున్సిపల్‌ మైదానంలో గురువారం పంపిణీ చేయనున్నారు.

నేడు బియ్యం సరఫరా ట్రక్కుల పంపిణీ

కడప(నాగరాజుపేట), జనవరి 20: పౌరసరఫరాల బియ్యం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద మంజూరు చేసిన ట్రక్కులను ఎంపికైన లబ్ధిదారులకు మున్సిపల్‌ మైదానంలో గురువారం పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి 510 వాహనాలకు లబ్ధిదారుల పేరిట రిజిస్ర్టేషన్‌ పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాష, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ఈడీల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.

Updated Date - 2021-01-21T05:11:54+05:30 IST