చిరువ్యాపారులకు మాస్క్‌లు పంపిణీ

ABN , First Publish Date - 2021-05-19T04:40:16+05:30 IST

మాస్కును ధరించి కరోనాను ధరిచేరనీయకండి అంటూ బీజేపీ నేతలు చిరువ్యాపారులకు మంగళవా రం మాస్క్‌లు పంపిణీ చేశారు.

చిరువ్యాపారులకు మాస్క్‌లు పంపిణీ

ప్రొద్దుటూరు అర్బన్‌, మే 18 : మాస్కును ధరించి కరోనాను ధరిచేరనీయకండి అంటూ బీజేపీ నేతలు చిరువ్యాపారులకు మంగళవా రం మాస్క్‌లు పంపిణీ చేశారు.  పార్టీ రాష్ట్రకమిటీ పిలుపు మేరక మాస్కుల పంపిణీ కార్య్యమాన్ని చేపట్టినల్లు జిల్లా ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్కుల ధరించడమేకాకుండా 45 సంత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయంచుకోవాలన్నారు.కరోనా సోకగానే అనవసర భయానికి లోను కాకుండా ధైర్యంగా ఉండాలన్నారు.రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మాస్కుల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుబ్రమణ్యం, యువమోర్చా అధ్యక్షుడు నరేష్‌ కుమార్‌ పరమేశ్వరరావు బాలనరసింహులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T04:40:16+05:30 IST