పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

ABN , First Publish Date - 2021-05-31T04:10:56+05:30 IST

విశ్రాంత ఉద్యోగు లు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువు రికి సహాయపడడం అభినందనీయమని మున్సిపల్‌ ఛైర్మన వాకమల్ల రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ
పారిశుధ్య కార్మికులకు సరుకులు అందిస్తున్న మున్సిపల్‌ ఛైర్మన, కమిషనరు తదితరులు

బద్వేలు రూరల్‌, మే 30: విశ్రాంత ఉద్యోగు లు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువు రికి సహాయపడడం అభినందనీయమని మున్సిపల్‌ ఛైర్మన వాకమల్ల రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌యార్డులో పెన్షనర్స్‌ అసోసియేషన సంఘం అధ్యక్షుడు రామారెడ్డి, విశ్రాంత డీఈ పాలకొండు రా మక్రిష్ణారెడ్డి సహకారంతో పారిశుధ్య కార్మికు లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ

పెన్షనర్స్‌ అసోసియేషన సంఘం అధ్యక్షుడు అంకిరెడ్డి రామారెడ్డి, విశ్రాం త డీఈ పాలకొండు రామక్రిష్ణారెడ్డి గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించా మన్నారు. కరోనా రెండో దశలో ఉత్తమ సేవలందిస్తున్న మున్సిపల్‌, పారిశుధ్య కార్మికులకు  సరుకులను అందించి సేవానిరతిని చాటుకున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనరు క్రిష్ణారెడ్డి, మార్కెట్‌ యార్డు సెక్రటరీ నాగిరెడ్డి, కత్తి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-31T04:10:56+05:30 IST