హిజ్రాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2021-08-22T05:00:51+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో మండలంలోని శాటిలైట్‌ సిటీ వద్ద కాపురముంటున్న హిజ్రాలకు సిర్డ్‌, స్ఫూర్తి ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థలు శనివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశా రు.

హిజ్రాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

చెన్నూరు, ఆగస్టు 21: కొవిడ్‌ నేపథ్యంలో మండలంలోని శాటిలైట్‌ సిటీ వద్ద కాపురముంటున్న హిజ్రాలకు సిర్డ్‌, స్ఫూర్తి ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థలు శనివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా హిజ్రాల సంఘం అధ్యక్షురాలు సంఘవి మా ట్లాడుతూ కొవిడ్‌ సమయంలో హిజ్రాలు పనుల్లేక ఆర్థిక ఇబ్బందు లు పడుతున్న సమయంలో స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వడం సంతోషకరమన్నారు. దాదాపు 22 రకాల నిత్యావసర వస్తువులను, మెడికల్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు కరీముల్లా, స్ఫూర్తి ఫౌండేషన్‌ డైరెక్టరు శేఖర్‌, జిల్లా సేవా సంస్థ ప్రతినిధులు విష్ణు, జూటూరు విజయకుమార్‌, శివ శంకర్‌, కుమారి, సుమిత్ర, నెహ్రూ యువ కేంద్రం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T05:00:51+05:30 IST