కరోనా కిట్లు పంపిణీ

ABN , First Publish Date - 2021-05-22T04:48:05+05:30 IST

మండలంలోని పాత్రికేయులకు కొవిడ్‌-19 కిట్లను కొండాపురం సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ మంజునాథలు పంపిణీ చేశారు.

కరోనా కిట్లు పంపిణీ
పాత్రికేయులకు కొవిడ్‌ కిట్టు పంపిణీ చేస్తున్న సీఐ, ఎస్‌ఐ

కొండాపురం, మే 21: మండలంలోని పాత్రికేయులకు కొవిడ్‌-19 కిట్లను కొండాపురం సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ మంజునాథలు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పాత్రికేయులు తమ విధులను నిర్వహిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తుండడం ఎంతో అభినందనీయమన్నారు. మండలంలోని ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా పాత్రికేయులకు కొవిడ్‌ మందుల కిట్టును, మాస్కులను పంపిణీ చేశారు. కొవిడ్‌ సమయంలో నిబంధనలు పాటిస్తూ  కుటుంబాలను కాపాడుకోవాలని సూచించారు. 

ముద్దనూరులో:స్థానిక విలేకరులకు శుక్రవారం సీఐ హరినాథ్‌ నేతృత్వంలో శానిటైజర్‌, విటమిన్‌, ప్యారాసిట్‌మాల్‌ మాత్రల కిట్‌ను అందజేశారు. కొవిడ్‌లో విలేకరుల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. కరో నా జాగ్రత్తలపై ప్రజలకు చేరవేయడంలో విలేకరుల కృషి అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ శంకర్‌రావు, ఏఎ్‌సఐ శ్రీనివాసులు, రవితేజ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-22T04:48:05+05:30 IST