చేనేతలకు చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-08-11T05:22:55+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేనేత రంగాన్ని ఆదుకుం టూ నేత కార్మికుల ను అభివృద్ధి చేసేందుకు నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారని మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

చేనేతలకు చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి

బద్వేలు, ఆగస్టు10: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేనేత రంగాన్ని ఆదుకుం టూ నేత కార్మికుల ను అభివృద్ధి చేసేందుకు నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారని మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ చేతుల మీదుగా 3వ విడత వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం మెగా చెక్‌ను లబ్ధిదారులకు అందజేశారు. ఏటా చేనేత కార్మికులకు రూ.24వేలు ఆర్థిక చేయూత కల్పిస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈపథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T05:22:55+05:30 IST