5 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ వితరణ

ABN , First Publish Date - 2021-05-21T04:57:25+05:30 IST

ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ వితరణ చేసిన డార్విన్‌ ఫార్మ్‌ కంపెనీ దాతృత్వం అభినందనీయమని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ ఛాంబరులో కంపెనీ ప్రతినిధులు 5 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను అందించారు.

5 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ వితరణ
కలెక్టర్‌కు అందిస్తున్న కంపెనీ ప్రతినిధులు

కడప(కలెక్టట్‌), మే 20: ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ వితరణ చేసిన డార్విన్‌ ఫార్మ్‌ కంపెనీ దాతృత్వం అభినందనీయమని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ ఛాంబరులో కంపెనీ ప్రతినిధులు 5 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విజయవాడకు చెందిన డార్విన్‌ ఫార్మ్‌ కంపెనీ ప్రతినిధులు రూ.5 లక్షల విలువైన 5 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను వితరణ చేశారని, వీటిని అవసరమైన ఆసుపత్రులకు పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు కలెక్టర్‌ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ డార్విన్‌ కంపెనీ ఎండీ ఎ్‌ససీవీ రత్నరెడ్డి, కదిరి వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T04:57:25+05:30 IST