వ్యక్తి అదృశ్యం : కేసు నమోదు
ABN , First Publish Date - 2021-05-21T04:45:46+05:30 IST
కొరపాటిపల్లె వాసి పాములూరి లోకేశ్వర్‌రెడ్డి (55) ఈనెల 12వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోరుమామిళ్ల, మే 20: కొరపాటిపల్లె వాసి పాములూరి లోకేశ్వర్‌రెడ్డి (55) ఈనెల 12వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 12వ తేదీ పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండుకు వచ్చాడని, తరువాత కనిపించలేదని పేర్కొన్నారు. అన్నిచోట్ల గాలించి ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసుస్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మోహన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.