శమీదర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-02-07T04:37:44+05:30 IST

సంక్రాంతి పండుగ అనంతరం పారువే టకు వెళ్లిన శ్రీదేవీ, భూదేవి సమేత మాధవరాయస్వామి శనివా రం తిరిగి మైదుకూరులోని ఆలయం చేరుకున్నారు.

శమీదర్శనానికి పోటెత్తిన భక్తులు

మైదుకూరు, ఫిబ్రవరి 6: సంక్రాంతి పండుగ అనంతరం పారువే టకు వెళ్లిన శ్రీదేవీ, భూదేవి సమేత  మాధవరాయస్వామి శనివా రం తిరిగి మైదుకూరులోని ఆలయం చేరుకున్నారు. ఏటా సంక్రాం తి పర్వదినం అనంతరం నిర్వహించే పారు వేటకు చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లడం ఆనవాయితీ. జనవరి 16న బయలు దేరిన స్వామి వారు అన్ని గ్రామాలు తిరిగి మైదుకూరు చేరుకోవడంతో స్వామి వారిని శమిదర్శనానికి తీసుకెళ్లారు. ఈ ఉత్సవంలో భక్తులు పోటెత్తారు. ఆలయం నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో శమి వృక్షం నీడలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అంద చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-07T04:37:44+05:30 IST