400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2021-11-10T05:17:15+05:30 IST

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యంపై జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు.

400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

కడప(క్రైం), నవంబరు 9 : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యంపై జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. 400 లీటర్ల బెల్లంఊట ధ్వంసం చేశారు. 8.52 లీటర్ల దేశీ అక్రమ మద్యం(ఎన్‌డీపీఎల్‌) స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. 2 కేసులు నమోదు చేశారు. నిషేధిత గుట్కాకు సంబంధించి ఒక కేసు నమోదు చేసి 1311 ప్యాకెట్ల గుట్కా స్వాధీనం చేసుకొని వ్యక్తిని అరెస్టు చేశారు. 

 

Updated Date - 2021-11-10T05:17:15+05:30 IST