కూరగాయలు తరుగుతూ గాయపడ్డ డిప్యూటీ జైలర్
ABN , First Publish Date - 2021-10-21T04:45:55+05:30 IST
కడప మహిళా సెంట్రల్ జైలులో డిప్యూటీ జైలర్‌గా పనిచేస్తున్న షేక్ ఇమామ్‌బీకి చెయ్యి తెగి గాయపడ్డారు.

కడప(క్రైం), అక్టోబరు 20: కడప మహిళా సెంట్రల్ జైలులో డిప్యూటీ జైలర్‌గా పనిచేస్తున్న షేక్ ఇమామ్‌బీకి చెయ్యి తెగి గాయపడ్డారు. ఈ మేరకు కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన షేక్ ఇమామ్‌బీ డిప్యూటీ జైలర్‌గా శిక్షణ పూర్తిచేసుకుని కడప మహిళా జైలులో ప్రొవిజనల్ జైలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం వంట చేసే సమయంలో కూరగాయలు తరుగుతూ ప్రమాదవశాత్తూ కత్తి తగలడంతో చెయ్యి తెగి రక్తం ఎక్కువ కారింది. దీంతో తన క్వార్టర్స్‌లోని సిబ్బంది చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది. వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తన సిబ్బందితో డిప్యూటీ జైలర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకొని కేసును రిమ్స్ పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా డిప్యూటీ జైలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మహిళా జైల్ సూపరింటెండెంట్ వసంతకుమారిని ఫోన్‌లో వివరణ కోరగా.. డిప్యూటీ జైలర్ కూరగాయలు తరుగుతూ గాయపడ్డారని అన్నారు.