విద్యుత్‌ తీగలతో పొంచి ఉన్న ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-20T04:52:33+05:30 IST

మండలంలోని గూడెం చెరువు గ్రామంలో కరెంటు తీగెలు ఇంటి గోడపై దగ్గరగా పోతుండడంతో ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని స్థానికు లు ఆందోళన చెందుతున్నారు.

విద్యుత్‌ తీగలతో పొంచి ఉన్న ప్రమాదం
ఇంటి గోడపై వేలాడుతున్న తీగెలు

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 19: మండలంలోని గూడెం చెరువు గ్రామంలో కరెంటు తీగెలు ఇంటి గోడపై దగ్గరగా పోతుండడంతో ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని స్థానికు లు ఆందోళన చెందుతున్నారు.  ఇటీవల గూడెం చెరువు గ్రామాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సందర్శించినప్పుడు కరెం టు, మంచినీటి సమస్యలు స్థానిక ప్రజలు తెలియజేశారు. కాగా తమ ఇళ్ల మధ్య కరెంటు తీగెలు గోడలపై ఇంటికి సమీపాన చేతికందడం, ఆదమరచి వెళ్లినా తీగెలు తగులుతాయని భయపడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.  వెంటనే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని  ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-20T04:52:33+05:30 IST