వరదలతో ఆర్‌అండ్‌బీకి దెబ్బ

ABN , First Publish Date - 2021-11-24T05:26:21+05:30 IST

భారీ వర్షాలు వరదల దాటికి రోడ్లు భవనాల శాఖా రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. డివిజన్‌ పరిధిలోని అనేక ప్రాంతాల్లో కల్వర్టులు కొట్టుకుపోయాయి.

వరదలతో ఆర్‌అండ్‌బీకి దెబ్బ
పోట్లదుర్తి - కమలాపురం మార్గ మధ్యలో దెబ్బతిన్న రోడ్డు

పాడైపోయిన 15 కల్వర్టులు  రవాణాకు తీవ్ర ఇక్కట్లు  నష్టంపై అధికారుల అంచనా

ప్రొద్దుటూరు అర్బన్‌, నవంబరు 23: భారీ వర్షాలు వరదల దాటికి రోడ్లు భవనాల శాఖా రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. డివిజన్‌ పరిధిలోని అనేక ప్రాంతాల్లో కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దాదాపు ు 15 కల్వర్టులు వరకు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. రోడ్లు, కల్వర్టుల నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు సబ్‌డివిజన్‌ పరిధిలో ఎక్కువగా దెబ్బతిన్నాయి. లింగాపురం - కల్లూరు మధ్య మార్గంలో రెండు కల్వర్టులు, పర్లపాడు -పెద్దపసుపుల మార్గంలో రెండు కల్వర్టులు, ఉలవపల్లె- చౌడూరు మధ్యలో రె ండు, గుండ్లకుంట - మేడిదిన్నె మధ్యలో ఒక కల్వర్టు, చిన్నమొడియం- చదిపిరాళ్ళ మధ్య రెండు కల్వర్టులు, అంబవరం - సున్నపరాళ్ళపల్లె మధ్య ఒకటి, పాలూరువద్ద ఒక కల్వర్టు, ఉరుటూరు - కొమ్మద్ది అలాగే చిలమకూరు -చిర్రాజుపల్లి మధ్య, పలుగురాళ్ళపల్లె -తొట్లపల్లె మధ్య ఒక్కో కల్వర్టు చొప్పున చిలమకూరు- కొమ్మద్ది మధ్య నాలుగు చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఇక స్టేట్‌ హైవే రోడ్లలో ప్రొద్దుటూరు- కొర్రపాడు రోడ్డులోని కామిశెట్టి కాలేజి వద్ద, ఎర్రగుంట్లలో రైల్వేస్టేషన్‌ ఏరియాలో, ప్రొద్దుటూరులోని  ఎర్రగుంట్ల - జమ్మలమడుగు బైపా్‌సరోడ్డులో దెబ్బతిన్నాయి. జిల్లా రోడ్లలో గుండ్లకుంట -పెద్దమొడియం మధ్య, ఖాజీపేట - కమలాపురం మధ్య, పోట్లదుర్తి -కమలాపురం మధ్య సంబటూరు దగ్గర రోడ్డు తీవ్రంగా వర్షాలకు కోసుకుపోయింది.


డివిజన్‌ పరిధిలో 80 కిలోమీటర్ల రోడ్లకు నష్టం

ప్రొద్దుటూరు డివిజన్‌ పరిధిలో దాదాపు 80 కిమీ మేర రోడ్లు దెబ్బతిన్నట్లు ఆర్‌అండ్‌బీ ప్రొద్దుటూరు డివిజనల్‌ ఈఈ నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో ప్రధానంగా జిల్లా స్ధాయి రోడ్లు 79 కిలోమీటర్ల మేర దెబ్బతినగా స్టేట్‌ హైవే రోడ్లు 1.8 కిమీ మేర దెబ్బతిన్నట్లు తెలిపారు.

Updated Date - 2021-11-24T05:26:21+05:30 IST