నేటి నుంచి కర్ఫ్యూ సడలింపు

ABN , First Publish Date - 2021-06-21T06:49:19+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ సడలించింది. పగలంతా వాణిజ్య కార్యక్రమాలకు అనుమతించింది. యదావిఽధిగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి. జనం పగలంతా దైనందిన కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు.

నేటి నుంచి కర్ఫ్యూ సడలింపు

పగలంతా వాణిజ్య సంస్థలకు అనుమతి

తిరగనున్న బస్సులు

సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ

307 పాజిటివ్‌ కేసులు నమోదు

ముగ్గురు మృతి

కడప, జూన 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ సడలించింది. పగలంతా వాణిజ్య కార్యక్రమాలకు అనుమతించింది. యదావిఽధిగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి. జనం పగలంతా దైనందిన కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఆర్టీసీ బస్సులు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు తిరుగుతాయి. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. సడలింపు సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. కరోనా పాజిటివ్‌ కేసులు తీవ్రం కావడంతో జన సమూహాలు కట్టడి చేసేందుకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది కొద్దిరోజులు మధ్యాహ్నం 12 వరకు కర్ఫ్యూ విధించగా, మరలా సడలించి ఆదివారం వరకు మధ్యాహ్నం 2 వరకు అనుమతించింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోవడంతో మరలా నేటి నుంచి సాయంత్రం వరకు సడలింపు ఇచ్చింది. కరోనా కేసులు తగ్గుతుండడంతో జనాల్లో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా తిరగడం కనిపిస్తోంది. భౌతిక దూరం, శానిటైజరు, మాస్కులు లేకుంటే మరోసారి కరోనా ముప్పు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అధికార యంత్రాంగం కూడా జన సమూహాలపై కాస్త నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో 24 గంటల వ్యవధిలో మరో 307 మంది కరోనా బారిన పడినట్లు జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికి 1,04,457 మొత్తం కేసులు చేరుకున్నాయి. మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 635కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న 473 మందిని డిశ్చార్జి చేశారు. యాక్టివ్‌ కేసులు 2667 ఉన్నాయి. ఆసుపతుల్ర్లో 872, హోం ఐసోలేషనలో 1795 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో పాజిటివ్‌ రేటు 4.3గా నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే.. కడపలో 33 పాజిటివ్‌ కేసులు, వేములలో 25, రాజంపేటలో 26, కోడూరులో 23, కలసపాడు 11, పోరుమామిళ్ల 11, ఓబులవారిపల్లె 11, పులివెందుల 13, కొండాపురం 10, బి.మఠం 8, సిద్దవటం 8, చెన్నూరు 7, దువ్వూరు 7, బద్వేలు 7 కేసులు నమోదవగా మిగిలిన మండలాల్లో కూడా స్వల్పంగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-06-21T06:49:19+05:30 IST