కర్ఫ్యూ విధించినా తగ్గని ఉధృతి

ABN , First Publish Date - 2021-05-19T04:16:28+05:30 IST

రాష్ట్రంలో పటి ష్టమైన చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ వ్యాప్తి లో ఉధృతి తగ్గడంలేదు.

కర్ఫ్యూ విధించినా తగ్గని ఉధృతి
పులివెందుల పాతబస్టాండ్‌ సమీపంలో జన సందోహం

విచ్చలవిడిగా తిరుగుతున్న వైనం 

నిబంధనలు గాలికి - కనిపించని భౌతిక దూరం

పులివెందుల రూరల్‌, మే 18: రాష్ట్రంలో పటి ష్టమైన చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ వ్యాప్తి లో ఉధృతి తగ్గడంలేదు. పాజిటివ్‌ సోకిన వ్యక్తులే పరోక్షంగా వైరస్‌ వ్యాప్తికి కారకులవు తున్నారు. పులివెందుల అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుం చి ఇప్పటి వరకు మొత్తం 1296 కొవిడ్‌ కేసు లు నమోదయ్యాయి.

యాక్టివ్‌ కేసులు 705 కాగా 33 మంది కొవిడ్‌ కారణంగా మృతిచెం దినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాగా కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు వైద్య, మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు శాఖల అధికా రులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వ లేక పోతున్నాయనే చెప్పాలి. దీంతో ఉద యం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12గంట ల వరకే  తిరిగేందుకు, పనులు, వ్యాపార నిర్వహణ, రవాణాకు అవకాశం కల్పిస్తూ  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వైరస్‌ వ్యా ప్తిని అరికట్టలేకున్నారని చెప్పవచ్చు.

ప్రజలు ఎక్కడా భౌతిక దూరం పాటించకపోవడం తోనే వైరస్‌ వ్యాప్తి జరుగుతోందని చెప్పవ చ్చు. ముఖ్యంగా మద్యం దుకాణాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలు ఎట్టి పరిస్థితుల్లో కావనే విమర్శ ఉంది. కొవిడ్‌ పరీక్షలు చేసు కుని పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తి ప్రైమరీ, సెకం డరీ కాంటాక్ట్‌లను గుర్తించడం కోసం వైద్యా ధికారులు తలలుపట్టుకునే పరిస్థితి నెలకొం ది.

స్థానిక జేఎన్టీయూలో కొవిడ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో సగం మంది కూడా కొవిడ్‌ సెంటర్‌లో ఉండడం లేదు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటి, చుట్టుపక్కల మున్సిపల్‌ అధికా రులు హైపోక్లొరైట్‌ ద్రావణం పిచికారీ, బ్లీచిం గ్‌ పౌడర్‌ చల్లడంలో అలసత్వం వహిస్తున్నా రనే ఆరోపణలున్నాయి.

ఒకటి లేదా రెండు రోజుల తర్వాత హైపోక్లొరైట్‌ను పిచికారీ చేస్తున్నారు. ఎక్కడైతే వైరస్‌ వ్యాప్తికి అవకా శం ఎక్కువగా ఉంటుందో అక్కడ అధికారు లు పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమ వుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. దీంతో కర్ఫ్యూ రోజులను ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం పెంచింది.



Updated Date - 2021-05-19T04:16:28+05:30 IST