పొలాల వద్దకు వెళ్లేందుకు నది దాటుతూ...

ABN , First Publish Date - 2021-12-09T04:31:25+05:30 IST

పాపాఘ్ని నది అవతలి ఒడ్డున ఉన్న తమ భూముల వద్దకు వెళ్లేందుకు నది దాటుతుండగా ముగ్గురు వ్యక్తులు ప్రవాహ వేగానికి కొట్టుకు పోయారు.

పొలాల వద్దకు వెళ్లేందుకు నది దాటుతూ...
పుల్లయ్య మృతదేహం

ప్రవాహ వేగానికి ఒకరి మృతి, ఇద్దరు సురక్షితం

వల్లూరు, డిసెంబరు 8: పాపాఘ్ని నది అవతలి ఒడ్డున ఉన్న తమ భూముల వద్దకు వెళ్లేందుకు నది దాటుతుండగా ముగ్గురు వ్యక్తులు ప్రవాహ వేగానికి కొట్టుకు పోయారు. అందులో ఇద్దరు ఓ చెట్టును పట్టుకుని బయటపడగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిఽధిలోని లేబాక ఎస్సీ కాలనీకి చెందిన పుల్లయ్య (75), జమాల్‌, ఖాజా అనే ముగ్గురు రైతులు తమ పొలాలు పాపాఘ్ని నది అవతల వైపు ఉండటంతో అక్కడకు వెళ్లేందుకు నది దాటుతూ కొట్టుకుపోయారు. అందులో జమాల్‌, ఖాజా అనే ఇద్దరు ఓ చెట్టుకొమ్మను పట్టుకొని ప్రాణలతో బయటపడగా పుల్లయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. బంధువులు, స్థానికులు, గ్రామస్థులు అతడి ఆచూకీ కోసం వెతకగా నది మధ్యలో బురదలో మృతదేహం బయటపడింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి వెళ్లి అతడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-12-09T04:31:25+05:30 IST