ఐకార్‌లో ర్యాంకుల పంట

ABN , First Publish Date - 2021-12-07T05:33:36+05:30 IST

మండలంలోని అనంతరాజుపేట ఉద్యాన యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఐకార్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) పరీక్షల్లో ర్యాంకులు సాధించారు. సోమవారం కళాశాల అసోసియేట్‌ డీన్‌ బి.శ్రీనివాసులు, యూనివర్సిటీ ఆచార్యులు రూత్‌, స్వరాజ్యలక్ష్మీలు మాట్లాడుతూ

ఐకార్‌లో ర్యాంకుల పంట

రైల్వేకోడూరు, డిసెంబరు 6: మండలంలోని అనంతరాజుపేట ఉద్యాన యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఐకార్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) పరీక్షల్లో ర్యాంకులు సాధించారు. సోమవారం కళాశాల అసోసియేట్‌ డీన్‌ బి.శ్రీనివాసులు, యూనివర్సిటీ ఆచార్యులు రూత్‌, స్వరాజ్యలక్ష్మీలు మాట్లాడుతూ అనంతరాజుపేట ఉద్యాన కళాశాలలో కోర్సులు పూర్తి చేసి ఐకార్‌ పరీక్షలు రాశారని, ఇందులో తమ విద్యార్థులు ఎన్‌. బాలాజీ 12 ర్యాంకు, జి.ఆనంద్‌రెడ్డికి 79, ఎస్‌.మౌనికకు 48, బీఆర్‌ వాసవిదేవికి 41, జి.బ్రాహ్మణికి 73, వి.మహేష్‌కు 416, ఎల్‌.సాయిమౌళికి 131, వి.హరికకు 158, ఎం.వెంకటేశ్వర్లుకు 67, పీఎస్‌ శ్వేతకు 125వ ర్యాంకు వచ్చినట్లు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-12-07T05:33:36+05:30 IST