ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-02-27T05:14:39+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గు ముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

చిట్వేలి, ఫిబ్రవరి 26 : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గు ముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇటీవల చేసిన కరోనా వైద్య పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్‌నిర్ధారణ కావడంతో మండలంలో మళ్లీ కరోనా కల్లోలం ఏర్పడింది. మండల పరిధిలోని తుమ్మచెట్లపల్లె ప్రాథమిక పాఠశాలలో ఈనెల 24వ తేదీ 11 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్‌ శివప్రసాద్‌గౌడ్‌ శుక్రవారం తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులను హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో శ్యాంసన్‌ సిబ్బందితో గ్రామాన్ని సందర్శించి గ్రామా ల్లో పారిశుధ్య పనులు చేపట్టి బ్లీచింగ్‌ చల్లించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:14:39+05:30 IST