మళ్లీ కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-04-13T05:36:35+05:30 IST

జిల్లాలో మళ్లీ కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో కల్లోలం సృష్టిస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఎక్కడే కానీ జనం కూడా కనీసం కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. దీంతో వైరస్‌ వేగం పెంచుతోంది.

మళ్లీ కరోనా కల్లోలం

24 గ ంటల్లో 259 పాజిటివ్‌ కేసులు

వారం రోజులు 1063 కేసులు నమోదు

ప్రజల్లో కనిపించని కరోనా భయం

ఉదాశీనంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం

కడప, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో కల్లోలం సృష్టిస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఎక్కడే కానీ జనం కూడా కనీసం కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. దీంతో వైరస్‌ వేగం పెంచుతోంది. 24 గంటల వ్యవధిలో 259 మందిలో వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 57,300కు చేరుకుంది. ఇప్పటివరకు 535 మంది మృత్యువాత పడ్డారు. ఈనెల ఆరంభం నుంచి కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 12వ తేదీ నాటికి 31 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సోమవారం నాటికి కేవలం 12 రోజుల్లో 1307 కేసులు నమోదయ్యాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 1063 కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి చూస్తే సెకండ్‌వేవ్‌ ఎంత ఉధృతంగా వ్యాప్తి చెందుతుందో అర్థమవుతుంది. లాక్‌డౌన విధించి గత ఏడాది కట్టడి చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కరోన కట్టడి గురించి అధికారులు చెబుతున్న మాటలు పత్రికల్లో వస్తున్నాయి తప్ప కట్టడికి అంతగా చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి పోలీసులు మాత్రం జరిమానాలు విధించడంతో పాటు మాస్కులు ఇస్తూ వారిలో అవగాహన కల్పిస్తున్నారు. 


విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు

సెకండ్‌వేవ్‌ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ జనాల్లో మాత్రం ఆ భయమే కనిపించడంలేదు. రోడ్ల వెంబడి ఎక్కడపడితే అక్కడ గుంపులుగా తిరుగుతున్నారు. వాణిజ్య సముదాయాల్లో కనీస భౌతికదూరం పాటించడం లేదు. అధికార యంత్రాంగం కూడా వారిని కట్టడి చేయకుండా వదిలేయడంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీంతో వైరస్‌ వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోంది. రాబోవు రోజుల్లో రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతాయని అధికార యంతారంగం అంచనాకు వచ్చేసింది. పాజిటివ్‌ వచ్చిన వారిని వీలైనంత వరకు హోం ఐసోలేషనకే పరిమితం చేస్తున్నారు. వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతున్నా కట్టడి చర్యలు మాత్రం నామమాత్రమే అన్న విమర్శలున్నాయి. 


వివరాలు తెలపని అధికారులు

కొవిడ్‌ కేసులు జిల్లాలో పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏయే ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతాల వారీగా పరిశీలిస్తే పత్రికల్లో ప్రచురించవచ్చు. దీంతో కొవిడ్‌ కేసులున్న ప్రాంతాల్లో ప్రజలు భయపడి అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోతారు. అయితే అధికారులు మాత్రం జిల్లా మొత్తం కేసులను చూపించి మమ అనిపిస్తున్నారు. దీంతో ఏ ప్రాంతంలో ఎన్ని కేసులు వచ్చాయో తెలియని పరిస్థితి ఉంది. సోమవారం 259 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎక్కడెక్కడ నమోదయ్యాయనేది బులిటినలో చూపించలేదు. దీంతో జనం కూడా కేసులు ఎక్కడో వస్తున్నాయిలే అనుకుని నిర్లక్ష్యం వహిస్తున్నారు. గుంటూరు, చిత్తూరు మరికొన్ని జిల్లాల్లో మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలను హెల్త్‌ బులెటినలో ఇస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం అలా ఇవ్వడం లేదు. 


మండలాల వారీగా వివరాలు ఇస్తాం

- అనిల్‌కుమార్‌, డీఎంహెచవో

కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలు మండలాల వారీగా ఇవ్వాలని కొవిడ్‌ కంట్రోల్‌ రూం సిబ్బందికి తెలిపాము. రెండు రోజుల్లో పాజిటివ్‌ కేసుల వివరాలు పూర్తిగా ఇస్తాము.

Updated Date - 2021-04-13T05:36:35+05:30 IST