జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-09-03T07:15:46+05:30 IST

కొండాపురంలోని జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం రేపింది. ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్‌ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 8వ తరగతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ స్రవంతి తెలిపారు.

జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం
జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

ఒక విద్యార్థికి పాజిటివ్‌ 

విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు 

కొండాపురం, సెప్టెంబరు 2: కొండాపురంలోని జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం రేపింది. ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్‌ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 8వ తరగతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ స్రవంతి తెలిపారు. దీంతో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరీక్షలు చేసినట్లు డాక్టర్‌ తెలిపారు. పాఠశాలలో కరోనా సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పరీక్షలను తహసీల్దార్‌ శోభనబాబు, ఎంపీడీవో జయసింహ, ఎంఈవో ఓబులేసు సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమంలో హెచఎం రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


61 పాజిటివ్‌ కేసులు నమోదు

ఒకరి మృతి

కడప, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 61 మందిలో కరోనా వైరస్‌ బయటపడినట్లు జిల్లా వైద్యాధికారి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,12,941కు కేసులు చేరాయి. ఒకరు మృతి చెందారు. మృతుల సంఖ్య 701కి  చేరింది. కరోనా నుంచి కోలుకున్న 80 మందిని డిశ్చార్జి చేశారు. రికవరీ సంఖ్య 1,11,692కు చేరింది. ఆసుపత్రుల్లో 87, హోం ఐసోలేషనలో 394 మంది చికిత్స పొందుతున్నారు. మండలాల వారీగా చూస్తే.. కడపలో 8, వీరబల్లె, రామాపురంలో 7 చొప్పున, మిగిలిన మండలాల్లో స్వల్పంగా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-09-03T07:15:46+05:30 IST