దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-11T05:22:17+05:30 IST

పాత దేవాలయాన్ని పునురుదరణ పనులు ప్రారంభించారు.

దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభం
పాత రామాలయాన్ని తొలగిస్తున్న దృశ్యం

లింగాల, ఆగస్టు 10: పాత దేవాలయాన్ని పునురుదరణ పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక రామాలయ దేవాలయం లోని సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలకు వేద పండితు లు శంకరస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ ఉన్న పాత గుడి స్థానంలో కొత్త గుడి నిర్మించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయిం  చారు. చందాలు పోగు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తే దేవదాయ శాఖ వారు దీనికి మూ డొంతుల మేరకు ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు ముందుకు వచ్చినట్లు గ్రామ పెద్దలు తెలిపా రు. దీంతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలోని విగ్రహానికి తీసి మరోచోట ఉంచి పాత గుడిని ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు.

Updated Date - 2021-08-11T05:22:17+05:30 IST