రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , First Publish Date - 2021-11-27T05:11:03+05:30 IST
భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రతి భారతీయుడు తనవంతు కృషిచేయాలని కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. శుక్ర వారం 72వ భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగింది.

కలెక్టర్ వి.విజయరామరాజు
కడప(కలెక్టరేట్/ఎడ్యుకేషన్/మారుతీనగర్), నవంబరు 26: భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రతి భారతీయుడు తనవంతు కృషిచేయాలని కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. శుక్ర వారం 72వ భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా భారతరత్న అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ విజయరామరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతిని ఆకాంక్షించి నవంబరు 26వ తేది 1949న జాతికి అంకితం చేసి ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. ఈ విషయాన్ని మనందరం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో మలోల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ వెంకటసుబ్బయ్య, కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భారత రాజ్యాంగంపై అవగాహన ఉండాలి
సీనియర్ సివిల్ జడ్జి కవిత
భారత రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి కవిత పేర్కొన్నారు. కడప నగరం చెమ్ముమియాపేట జడ్పీ బాలికోన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు సోఫియా, ఫిజికల్ డైరెక్టర్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిరాశ్రయులకు దుస్తుల పంపిణీ
ఏ ఆధారం లేని నిరాశ్రయులకు అన్ని వసతులు కల్పించడం మిక్కిలి అభినందనీయమని జిల్లా లీగల్ సెల్ అఽథారిటీ సర్వీసెస్ సీనియర్ సివిల్ జడ్జి కవిత పేర్కొన్నారు. బ్యాక్ వర్డ్ కమ్యూనిటీ లిటరసీ డెవల్‌పమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పాత రిమ్స్‌లోని ఆదరణ నిరాశ్రయుల వసతి గృహంలోని వారికి దుస్తుల పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా జడ్జి హాజరై మాట్లాడారు.
మున్సిపల్ హైస్కూల్ మెయిన్‌లో
నగర మున్సిపల్ హైస్కూల్ మెయిన్‌లో సమగ్రశిక్ష అభియాన్ సీఎంఓ గంగిరెడ్డి, ఏఎ్‌సఓ పాలెంరాజా, ఐఈ కోఆర్డినేటర్ కేశవరెడ్డి పాల్గొని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి, ఉపాఽధ్యాయులు పాల్గొన్నారు.
