నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించండి

ABN , First Publish Date - 2021-02-06T05:12:43+05:30 IST

రాజంపేట ప్రాంతంలో జరిగే పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాజంపేట మండల ఎన్నికల అధికారి రెడ్డయ్య సూచించారు.

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించండి

రాజంపేట టౌన్‌, ఫిబ్రవరి 5 : రాజంపేట ప్రాంతంలో జరిగే పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాజంపేట మండల ఎన్నికల అధికారి రెడ్డయ్య సూచించారు. శుక్రవారం రాజంపేట మండల సభాభవనంలో అన్ని గ్రామ పంచాయతీల ఎన్నికల అధికారులకు బ్యాలెట్‌ బాక్సులను, బ్యాలెట్‌ పత్రాలను, ఎన్నికల సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డయ్య మాట్లాడుతూ రాజంపేట మండలంలోని మొత్తం 25 సర్పంచ్‌ స్థానాలకు, 242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 6వ తేదీన ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిక్కచ్చిగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఏఓ బాలమునిస్వామి, ఈఓఆర్‌డీ హరి, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T05:12:43+05:30 IST