షరతులతో కూడిన అనుమతులివ్వాలి
ABN , First Publish Date - 2021-09-04T05:03:28+05:30 IST
కొవిడ్‌ను బూచిగా చూపుతూ వినాయక చవితి పర్వదినాన్ని బహిరంగ ప్రదేశాల్లో కాకుండా కేవలం ఇళ్ళలోనే జరుపుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అధికారులకు ఆదేశాలివ్వడం సరైందికాదని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మనవిజయ్ పేర్కొన్నారు.

బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మన విజయ్
కడప(మారుతీనగర్), సెప్టెంబరు 3: కొవిడ్‌ను బూచిగా చూపుతూ వినాయక చవితి పర్వదినాన్ని బహిరంగ ప్రదేశాల్లో కాకుండా కేవలం ఇళ్ళలోనే జరుపుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అధికారులకు ఆదేశాలివ్వడం సరైందికాదని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మనవిజయ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓవైపు అధికార పార్టీ ముఖ్య నాయకుల సమావేశాలకు, సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సమయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంపులుగా ఒక్కచోట గుమికూడుతున్న సంగతి తెలిసిందేనన్నారు. అక్కడ రాని కరోనా వినాయకచవితి ఉత్సవాలకే వస్తున్నట్లుగా ప్రభుత్వం అనుమతివ్వకుండా దాటవేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చవితిని ఆనందకరంగా జరుపుకునేందుకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మహేష్, నగర అధ్యక్షుడు హరీష్, సభ్యులు పాల్గొన్నారు.