రాయచోటి రోడ్డుపై కంపోస్ట్‌ యార్డ్‌

ABN , First Publish Date - 2021-12-20T04:54:51+05:30 IST

రాయచోటి-రాజంపేట రోడ్డు పాలెం వద్ద ఏర్పాటు చేసిన కంపోస్ట్‌ యార్డ్‌లో వేయాల్సిన చెత్తను ఇష్టమొచ్చినట్లు రోడ్లపై వేయడం వల్ల వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

రాయచోటి రోడ్డుపై కంపోస్ట్‌ యార్డ్‌
రోడ్డుపై వేసిన చెత్తాచెదారం

 పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు 

రాజంపేట, డిసెంబరు19 : రాయచోటి-రాజంపేట రోడ్డు పాలెం వద్ద ఏర్పాటు చేసిన కంపోస్ట్‌ యార్డ్‌లో వేయాల్సిన చెత్తను ఇష్టమొచ్చినట్లు రోడ్లపై వేయడం వల్ల వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. కంపోస్ట్‌ యార్డ్‌ లోపల వేయాల్సిన చెత్తను రోడ్లపై వేసి పోతూ ఉండటంతో ఆ మార్గంలో వాహనాలు, పాదచారులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.  అంతేకాక రోడ్డుపై చెత్త వేయడం వల్ల రాయచోటి-రాజంపేట వైపు వెళ్లేవారు చాలా అసౌకర్యానికి గురువుతున్నారు.  మున్సిపల్‌ అధికారులు, పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోడ్డుపైనే చెత్తవేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకొని రోడ్డుపై చెత్తను వేయకుండా కంపోస్ట్‌ యార్డ్‌లో వేసేలా చూడాలన్నారు. 

Updated Date - 2021-12-20T04:54:51+05:30 IST