టీడీపీ మద్దతు అభ్యర్థిపై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-06T05:20:59+05:30 IST

పోరుమామిళ్ల పంచాయతీ స్థానానికి టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న యనమల సుధాకర్‌పై అతని బంధువు రజనీప్రసాద్‌ సీఐ మోహన్‌రెడ్డికి ఫిర్యా దు చేశారు.

టీడీపీ మద్దతు అభ్యర్థిపై పోలీసులకు ఫిర్యాదు
అస్వస్థతకు గురైన టీడీపీ అభ్యర్ధి యనమల సుధాకర్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

వత్తిడికి గురై ఆస్పత్రిపాలైన యనమల సుధాకర్‌


పోరుమామిళ్ల / కడప  ఫిబ్రవరి 5: పోరుమామిళ్ల పంచాయతీ స్థానానికి టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న యనమల సుధాకర్‌పై అతని బంధువు రజనీప్రసాద్‌ సీఐ మోహన్‌రెడ్డికి ఫిర్యా దు చేశారు. దీంతో పోలీసులు సుధాకర్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించి పంపారు. అయితే వత్తిడికి గురైన సుధాకర్‌ అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బలిజకోటవీధికి చెందిన రజనీప్రసాద్‌ అనే వ్యక్తి తనను యనమల సుధాకర్‌ కిడ్నాప్‌ చే సేందుకు ప్రయత్నాంచారని ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయమై ఇరువురిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించి పంపామన్నారు.  శుక్రవారం  టీడీపీ అభ్యర్ధిని పోలీసుస్టేషన్‌కు పిలిపించినట్లు తెలియడంతో టీడీపీ నాయకులు పోలీసుస్టేషన్‌ వచ్చారు. అలాగే వైసీపీ శ్రేణులు కూడా పోలీసుస్టేషన్‌ చేరుకున్నారు. 

పరిస్థితిని గమనించిన సీఐ మోహన్‌రెడ్డి ఇరువర్గాల వారిని సర్ధి చెప్పి పంపారు. అయితే స్టేషన్‌ నుంచి బ యటికి వెళ్లిన కొద్దిసేపటికి యనమల సుధాకర్‌ వత్తిడికి గురి కావడంతో బీపీ లెవల్స్‌ పడిపోయాయి. వెంటనే టీడీపీ నాయకులు అతన్ని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. విషయం అందరికీ తెలియడంతో ఆసుపత్రి వద్దకు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. డాక్టరు సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు.  


అక్రమ కేసులతోనే ఆసుపత్రిపాలు

పోరుమామిళ్ల సర్పంచ్‌ అభ్యర్థి యనమల సుధాకర్‌ గెలుస్తారనే ఉద్దేశ్యంతో ఆయనపై వైసీపీ వారు అక్రమ కేసు బనాయించాలని చూశారని, దీంతో వత్తిడికి లోనై ఆసుపత్రిపాలయ్యారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, హరిప్రసాద్‌, జీఎన్‌ఎ్‌స మూర్తిలు పేర్కొన్నారు.  కడపలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సుధాకర్‌ను శుక్రవారం వారు పరామర్శించి మాట్లాడారు. ఈ విషయమై ఎస్పీ అన్బురాజన్‌కు రెడ్యం ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. వీరి వెంట పోరుమామిళ్ల టీడీపీ నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T05:20:59+05:30 IST