అలుగు పగలకొట్టడంపై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-11-21T05:35:36+05:30 IST

చింతలచెరువు అలుగు ను పగులకొట్టారని గ్రామస్తులు రూరల్‌ ఎస్‌ఐ చంద్ర శేఖర్‌కు ఫిర్యాదు చేశారు.

అలుగు పగలకొట్టడంపై పోలీసులకు ఫిర్యాదు

బద్వేలు రూరల్‌, నవంబరు 20: చింతలచెరువు అలుగు ను పగులకొట్టారని గ్రామస్తులు రూరల్‌ ఎస్‌ఐ చంద్ర శేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి గ్రామస్తు లు తెలిపిన వివరాల్లోకెళితే... బయనపల్లి, చింతలచెరువు రైతులకు చింతల చెరువు ఆధారం. అయితే రెండేళ్ల కింద ట ఇరిగేషన్‌ శాఖ జిల్లా అధికారులు అలుగు ఎత్తు పెం చారు. దీంతో పొలాలు, ఇళ్లు నీటమునుగుతున్నాయంటూ బయనపల్లె గ్రామస్తులు ఆరోపించారు.

అలుగు ఎత్తు పెంచే సమయంలో ఇరిగేషన్‌ అధికారులను ప్రశ్నించక  సమస్య ఇప్పుడేమిటంటూ చింతలచెరువు రైతులు, ప్రజ లు ప్రశ్నిస్తున్నారు. ఇలా  కొంతకాలంగా బయనపల్లి, చింతలచెరువు గ్రామస్తులకు అలుగు విషయంలో వివా దం సాగుతోంది. కాగా శుక్రవారం రాత్రి ఎక్స్‌కవేటర్‌తో చెరువు అలుగును పగులకొడుతుండగా గ్రామస్తులు అం దరూ అలుగు వద్దకు చేరుకుని ఎక్స్‌కవేటర్‌ను అడ్డుకున్నా రు.

ఇరిగేషన్‌ అధికారులు చెబితేనే తాను వచ్చానంటూ తనకు ఏమీ తెలియదంటూ ఎక్స్‌కవేటర్‌ డ్రైవరు సమాధా నం ఇచ్చాడని గ్రామస్తులు తెలిపారు. అప్పటికి పనిని నిలిపివేయించిన గ్రామస్తులు శనివారం ఉదయం రూరల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఘటనపై గ్రామస్తులతో చర్చించి పరిష్కారిస్తామని రూర ల్‌ ఎస్‌ఐ చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.

Updated Date - 2021-11-21T05:35:36+05:30 IST