పాడిరైతులకు పరిహారం మంజూరు
ABN , First Publish Date - 2021-11-27T04:37:14+05:30 IST
ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పాడిరైతుల కు పరిహారం మంజూరైనట్లు డిప్యూటీ డైరెక్ట ర్ వెంకటేశ్వరరావు ప్రకటించారు.

పులివెందుల టౌన్, నవంబరు 26: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పాడిరైతుల కు పరిహారం మంజూరైనట్లు డిప్యూటీ డైరెక్ట ర్ వెంకటేశ్వరరావు ప్రకటించారు. మంజూరై న నిధులను పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం అందించినట్లు డీడీ తెలిపారు. ని యోజకవర్గ వ్యాప్తంగా చక్రాయపేట మండ లంలో 12 మంది, వేంపల్లె మండలంలో 3, వేముల మండలంలో 5, తొండూరు 5, సింహాద్రిపురంలో ఇద్దరు పాడి రైతులకు నష్టం జరిగిందన్నారు. వీరికి రూ.6,32,700 మంజూరైనట్లు డీడీ తెలిపారు. కార్యక్రమం లో సిబ్బంది పాల్గొన్నారు.