వరద సహాయక చర్యలపై కలెక్టర్ ఆరా
ABN , First Publish Date - 2021-11-27T04:36:11+05:30 IST
కలెక్టర్ విజయరామరాజు శుక్రవారం పె నగలూరు మండలంలో వరద సహాయక చ ర్యల పై ఆరా తీశారు.

పెనగలూరు, నవంబరు26: కలెక్టర్ విజయరామరాజు శుక్రవారం పె నగలూరు మండలంలో వరద సహాయక చ ర్యల పై ఆరా తీశారు. శుక్ర వారం సాయంత్రం ఆ యన పొందలూరు గ్రా మ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి చేరుకున్న వెం టనే సచివాలయంలోకి ప్రవేశించి ముందుగా అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బందిని పరిశీలించారు. ప్రస్తుత వరద పరిస్థితుల్లో ప్రజలకు చేస్తున్న సహాయక చర్యల గురించి తెలు సుకు న్నారు. అనంతరం కార్యాలయం వెలుపల డిప్యూటీ తహసీల్దారు మోహన్‌కృష్ణ, ఎంపీడీఓ వరప్రసాద్‌లతో వరద సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.