సీఎం ఇక్కడ ఒక మాట... ఢిల్లీలో మరొక మాట
ABN , First Publish Date - 2021-03-22T04:47:40+05:30 IST
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మాట ఢిల్లీలో మరొక మాట చెప్పి ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మండిపడ్డారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య
రైల్వేకోడూరు రూరల్, మార్చి 21: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మాట ఢిల్లీలో మరొక మాట చెప్పి ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మండిపడ్డారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 26న జరిగే భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేకచట్టాలు రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటికరణ ఆపాలని, కడప ఉక్కు ప్రభుత్వ రంగంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తోందని విమర్శించారు. ఎలక్ర్టికల్ యూనియన్ సెక్రటరీ రఫీ, సీఐటీయూ నాయకుడు మోదీ సుబ్బరాయుడు ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్. నాగసుబ్బారెడ్డి, కోడూరు నియోజకవర్గ కార్యదర్శి తుమ్మల రాధాక్రిష్ణయ్య, ఏఐటీయూసీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ మురళి, వెంకటేష్, పండుగోల మణి, మహిళా సమాఖ్య ఆర్గనైజర్ క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.