రోడ్డెక్కిన వీఆర్‌ఏలు

ABN , First Publish Date - 2021-07-13T05:27:59+05:30 IST

ముఖ్యమంత్రి జగన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ సోమవారం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల ఎదుట వీఆర్‌ఏలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం తాను

రోడ్డెక్కిన వీఆర్‌ఏలు
గాలివీడు తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న వీఆర్‌ఏలు

హామీలు విస్మరించిన సీఎం జగన

నిరసనల కార్యక్రమంలో వీఆర్‌ఏలు

కడప, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి జగన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ సోమవారం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల ఎదుట వీఆర్‌ఏలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం తాను ఆందోళనలు చేస్తుండగా 2017 మార్చి 24న జరిగిన ధర్నాలో ప్రతిపక్ష హోదాలో జగన ఆందోళనకు హాజరయ్యారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీఆర్‌ఏలకు రూ.15 వేల వేతనంతో పాటు నామినీలు, వీఆర్‌ఏ నుంచి వీఆర్వోల ప్రమోషన్లను ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. జగన అధికారంలోకి వచ్చారు. హామీలు అమలవుతాయని తమ ఆశలు అడియాశలయ్యాయని వారు వాపోయారు. గతంలో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌, మిగతా అధికారులను కలిసి హామీలు నెరవేర్చాలని కోరి రెండేళ్లు గడిచినా హామీలు అమలు కాకపోవడంతో తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని తెలిపారు. వీఆర్‌ఏలకు రూ.21 వేలు వేతనం ఇవ్వడం, డీఏ రూ.300 నుంచి రూ.500లకు పెంచాలని, నామినీలను, వీఆర్‌ఏగా పనిచేస్తూ చనిపోయిన కుటుంబంలోని వారసులకు వయసుతో నిమిత్తం లేకుండా వీఆర్‌ఏలుగా నియమించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. హామీలు వెంటనే నెరవేర్చాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ధైర్యం తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈనెల 19న ఆర్డీవో కార్యాలయం ఎదుట, 26న కలెక్టరేట్‌, ఆగస్టు 2, 3 తేదీల్లో విజయవాడలో రాష్ట్ట్ర స్థాయిలో ధర్నాలు చేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-07-13T05:27:59+05:30 IST