ట్రిపుల్‌ఐటీల్లో 18 నుంచి తరగతులు ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-13T05:03:03+05:30 IST

ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఈనెల 18వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.

ట్రిపుల్‌ఐటీల్లో 18 నుంచి తరగతులు ప్రారంభం

వేంపల్లె, జనవరి 12: ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఈనెల 18వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. కాగా ఈ నెలా ఖరు లో ప్రత్యేక కేటగి రీ సీట్లకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ఆర్జీ యూకేటీ ఆధ్వర్యంలో కొన సాగుతున్న నా లుగు ట్రిపుల్‌ ఐటీల్లో సీట్ల అడ్మిషన్‌ ప్రక్రి య పూర్తయింది. 4వ తేదీన ప్రారం భమైన కౌన్సెలింగ్‌ ప్రక్రి య సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు జరిగింది. 4400సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ ప్రారంభించగా ఎస్టీ కేటగిరీ విభాగంలో 9సీట్లు మిగి లాయి. ఆ విభాగంలోని విద్యార్థులను 20వేల ర్యాంకు వరకు పిలువగా శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో 9 సీట్లు మిగిలాయి. ఈనెల ఆఖరులో ప్ర త్యేక కేటగిరీ విభాగంలో క్యాప్‌, స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ, పీహెచ్‌ సీట్లు 257ను భర్తీ చేయ నున్నారు అదే సమయంలో ఎస్టీ విభాగంలో మిగిలిన 9సీట్లను భర్తీ చేస్తామని కన్వీనర్‌ గోపాల్‌రాజు తెలిపారు. 


నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో భర్తీ అయిన సీట్ల వివరాలు

ప్రస్తుతం నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో భర్తీ అయిన సీట్లలో ఓసీ విభాగానికి 1872, బీసీ విభాగంలో 1085 మంది, ఎస్సీ 561 మంది, ఎస్టీ 225 మంది, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 400మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ఈ విద్యార్థులకు ఈనెల 18వ తేదీ నుంచి ఆయా ట్రిపుల్‌ఐటీలలో తరగతులు ప్రారంభించనున్నారు. ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో జా యిన్‌ అయిన విద్యార్థులు ఒంగోలు పట్టణంలోని రావు అండ్‌ నాయుడు క్యాంపస్‌కు వెళ్లాల్సి ఉంటుందని, శ్రీకాకుళంకు జాయిన్‌ అయిన విద్యార్థులు జడ్చర్లలోని క్యాంపస్‌ కు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు

Updated Date - 2021-01-13T05:03:03+05:30 IST