కార్మిక హక్కుల సాధనే సీఐటీయూ లక్ష్యం

ABN , First Publish Date - 2021-05-31T04:27:03+05:30 IST

కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా సీఐటీయూ ఆవిర్భవించిందని యూనియన్‌ నేతలు పేర్కొ న్నారు.

కార్మిక హక్కుల సాధనే సీఐటీయూ లక్ష్యం
సీఐటీయూ జెండా ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు క్రైం, మే 30 :కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా సీఐటీయూ ఆవిర్భవించిందని యూనియన్‌ నేతలు పేర్కొ న్నారు. సీఐటీయూ 51వ అవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని  పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ  1970లో అవిర్భవించి ఈ రోజు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విస్తరించి కార్మికుల పక్షాన అండగా ఉంటోందన్నారు. ప్రభుత్వాలు మారినా కార్మికుల కష్టాలు తీరలేదన్నారు. కార్మికులకు రూ.24వేలు వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ  కార్యదర్శి విజయకుమార్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి సాల్‌మన్‌, కోశాధికారి రాఘవ, ఎస్‌ఎ్‌ఫఐ కార్యదర్శి వంశీ, సంజీవ్‌, పెద్దన్న,  నాయకుడు చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

జమ్మలమడుగులో..

జమ్మలమడుగు రూరల్‌, మే 30:  నిరంతరం కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలకోసం పోరాడుతున్న సంఘం సీఐటీయూ  ఏరియా ఉపాధ్యక్షుడు శివనారాయణ, ్లీ కమిటీ సభ్యుడు సిరివెళ్ల లక్ష్మినారాయణలు పేర్కొన్నారు. ఆదివారం  పట్టణంలోని పాత బస్టాండులో ఆటో స్టాండు పక్కన సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970 మే 30న కలకత్తాలో సీఐటీయూ కార్మిక సంఘం ఆవిర్భవించిందన్నారు.  కార్యక్రమంలో డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌, సీఐటీయూ పట్టణ అధ్యక్షులు విజయ్‌, దివాకర్‌పాల్గొన్నారు.

ఏడుగురు జూదరుల అరెస్టు 


కొండాపురం, మే 30: మండలంలోని పొట్టిపాడు గ్రామంలో ఏడుమంది జూదరులను పోలీసులు అరెస్టు చేశారు. గ్రామ శివార్లలో జూదమాడుతున్న వారి నుంచి రూ.49,200 నగదు స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కొండాపురం సీఐ సుదర్శన్‌ప్రసాద్‌, ఎస్‌ఐ మంజునాథలు తెలిపారు.Updated Date - 2021-05-31T04:27:03+05:30 IST