క్రిస్మస్‌ కానుకలు పంపిణీ

ABN , First Publish Date - 2021-12-26T05:10:41+05:30 IST

పట్టణంలోని వాజ్‌పేయి నగర్‌లో ఉన్న నిజస్వరూపిణి మందిర ఆవరణలో కువైట్‌కు చెందిన జై యాదవ సేవా సమితి ప్రతినిధులు శనివారం క్రిస్మస్‌ కానుకలను పంపిణీ చేశారు.

క్రిస్మస్‌ కానుకలు పంపిణీ

ప్రొద్దుటూరు రూరల్‌, డిసెంబరు 25: పట్టణంలోని వాజ్‌పేయి నగర్‌లో ఉన్న నిజస్వరూపిణి మందిర ఆవరణలో కువైట్‌కు చెందిన జై యాదవ సేవా సమితి ప్రతినిధులు శనివారం క్రిస్మస్‌ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాస్టర్‌ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ భారతీయులంతా ఒక్కటేనని, కులమతాలన్నీ ఒక్కటేనని పేర్కొన్నారు. జైయాదవ్‌ సేవా సమితి రిబ్కాసహాయంతో క్రైస్తవులందరికి భోజనాలు ఏర్పాటు చేయడంతోపాటు చీరలు పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జైయాదవ్‌ సేవా సమితి ప్రతినిధి చిన్నకొండయ్య, వికసిత ఫౌండేషన్‌ అధ్యక్షురాలు శూలం లక్ష్మిదేవి, శూలం శివప్రసాద్‌యాదవ్‌, శ్రీజ్ఞానసరస్వతీ దేవి చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షులు యనమల శ్రీనివా్‌సయాదవ్‌, చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షులుకదిరి సంజీవరాయుడుయాదవ్‌, ధర్మ, పశువుల సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-26T05:10:41+05:30 IST