బడి బయట పిల్లలను గుర్తించాలి

ABN , First Publish Date - 2021-03-23T05:02:23+05:30 IST

బడి బయట పిల్లలను గుర్తించేందుకు మంగళవారం నుంచి 31 వరకు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అఽధికారి శైలజ, సమగ్ర శిక్ష పథక అధికారి అంబవరపు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

బడి బయట పిల్లలను గుర్తించాలి
వెబ్‌నార్‌ ద్వారా సమీక్షిస్తున్న ఎస్‌ఎ్‌ఫసీవో అంబవరపు ప్రభాకర్‌రెడ్డి

నేటి నుంచి 31 వరకు స్పెషల్‌ డ్రైవ్‌

జిల్లా విద్యాశాఖ అఽధికారి


కడప(ఎడ్యుకేషన్‌), మార్చి 22: బడి బయట పిల్లలను గుర్తించేందుకు మంగళవారం నుంచి 31 వరకు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అఽధికారి శైలజ, సమగ్ర శిక్ష పథక అధికారి అంబవరపు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో ఆదివారం సాయంత్రం ఉప విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష సెక్టోరియల్‌ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్‌ చైర్మన్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 19,253 మంది బడి బయట పిల్లలు ఉన్నట్లు రాష్ట్ర కార్యాలయం గుర్తించిందన్నారు. వీరందరినీ పదిరోజుల పాటు జిల్లా, డివిజన్‌, మండల, క్లస్టరు కమిటీల ఆధ్వర్యంలో గుర్తించాలన్నారు. మండలాల్లో మండల విద్యాశాఖాధికారులు సమావేశం ఏర్పాటు చేసుకుని మంగళవారం నుంచి సర్వే నిర్వహించాలన్నారు. బడి బయట  గుర్తించిన పిల్లలను సమీప పాఠశాలలో కానీ, ప్రభుత్వం కేటాయించిన ఎన్జీవోస్‌ నిర్వహించే వాటిల్లో కానీ చేర్పించాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎల్‌ఎఫ్‌ కోఆర్డినేటర్‌ పాలెం రాజా పాల్గొన్నారు.


Updated Date - 2021-03-23T05:02:23+05:30 IST