గండికోట ప్రాజెక్టును పరిశీలించిన చీఫ్ ఇంజనీర్
ABN , First Publish Date - 2021-11-21T05:47:11+05:30 IST
గండికోట ప్రాజెక్టును చీఫ్ ఇంజనీర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి శనివారం పరిశీలించారు.

కొండాపురం, నవంబరు 20: గండికోట ప్రాజెక్టును చీఫ్ ఇంజనీర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి శనివారం పరిశీలించారు. వరదల నేపథ్యంలో గండికోట ప్రాజెక్టుకు పెన్నా, చిత్రావతి నదుల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. ప్రస్తుతం గండికోటకు వరదనీటి ద్వారా 90వేల క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు ఆయనకు వివరించారు. శుక్రవారం లక్షకు పైగా క్యూసెక్కులు వస్తుండగా శనివారం కొంతమేర తగ్గినట్లు వారు వివరించారు. వచ్చే నీటిని (90వేల క్యూసెక్కులు) యదాతథంగా మైలవరం జలాశయానికి వదులుతున్నట్లు వారు వివరించారు. ప్రస్తు తం ఆరు గేట్ల ద్వారా నీటిని వదులుతున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ ఉమామహేశ్వరావు, జేఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.