దేవాలయాల రికార్డుల తనిఖీ
ABN , First Publish Date - 2021-10-21T04:46:51+05:30 IST
ప్రొద్దుటూరు గ్రూపు పరిధిలోని 11 దేవాలయాల రికార్డులను దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ తనిఖీ చేశారు.

ప్రొద్దుటూరు టౌన్, అక్టోబరు 20: ప్రొద్దుటూరు గ్రూపు పరిధిలోని 11 దేవాలయాల రికార్డులను దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ తనిఖీ చేశారు. బుధవారం మిట్టా పాపయ్యసత్రం, కామనూరులోని భీమలింగేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, రాజుపాళెం మండలం టంగుటూరులోని మదనగోపాలస్వామి ఆలయాల రికార్డులను పరిశీలించారు. ఆయా దేవాలయాలకు ఉన్న స్థిర, చరాస్తులు, భూములు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, క్యాష్ బుక్కు, ఓచర్లు, దేవతల ఆభరణాలు తదితర రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఈవోలు రమణారెడ్డి, రామచంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.