ఆరోగ్యకేంద్రం తనిఖీ
ABN , First Publish Date - 2021-10-26T05:02:20+05:30 IST
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దుర్గాపురంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని డాక్ట ర్ సువర్ణ నయ్యద్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ బృందం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సిబ్బంది పనితీరుపై ప్రజలతో సమీక్ష చేసి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

నందలూరు, అక్టోబరు25 : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దుర్గాపురంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని డాక్ట ర్ సువర్ణ నయ్యద్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ బృందం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సిబ్బంది పనితీరుపై ప్రజలతో సమీక్ష చేసి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సృజన, డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, విశ్రాంత సీహెచ్వో పిల్లి పిచ్చయ్య, పీహెచ్ఎన్ మేరీ, వైద్య సిబ్బంది హిమశంకరి, శివరాం, లక్షుమయ్య, అంజినమ్మ, శాంత, రామసుబ్బమ్మ, ఆశాలు పాల్గొన్నారు.