డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ పరీక్ష తేదీల్లో మార్పులు
ABN , First Publish Date - 2021-11-21T05:45:34+05:30 IST
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైవీయూ పరిధిలో జరుగుతున్న డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఈశ్వర్‌రెడ్డి తెలిపారు.

కడప వైవీయూ, నవంబరు 20: వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైవీయూ పరిధిలో జరుగుతున్న డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో రహదారులు తెగిపోయి రాకపోకలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు అనుగుణంగా డిగ్రీ పరీక్షలను ఈనెల 24 నుంచి నిర్వహించడానికి రీషెడ్యూలు చేశామని తెలిపారు. సమాచారాన్ని సంబంధిత కళాశాలలకు పంపించామని, విద్యార్థులు గమనించాలని సూచించారు.